తన
చేతివేలి కుంచను
ఇంద్ర ధనస్సు రంగుల్లో ముంచి
కళల కాన్వాస్ పై చిలకరిస్తూ...
తనే చతుర్ముకుడై
తలరాతని చేతి గీతని
మార్చుకున్నాడు
అమ్మ ఒడిని దిగి
ఆమనిలో అడుగిదినపుడే....
అతను
ప్రకృతిలో తిరుగాడిన
తన పసి భాల్యాన్ని
మోతబావి మెట్లపై
పొలం పైరు తలలపై
నీటి వంకల అలలపై
పడుతూ లేస్తూ.. పరుగులుతీసే
పుడమి అందలసుందర రాసులని
తన కంటి కాగితంపై చొపించేవాడు
తొలకరి జల్లులకి
తడిసిన పుడమి
మట్టి వాసనని
ముక్కుపుటలనిండా పీల్చుకుని
గుండెలనిండా
నింపుకున్న తననిచూసి
శూన్యంలో ప్రయాణించే
వివిధ భంగిమ రేఖలు
అతని కుంచె ఒడిలో
అద్భుత చిత్రాలుగా ఒదిగిపోయేవి
మట్టి ముద్దని
మురిపెంగా చేతితో తాకి
తల్లి స్పర్శని
తండ్రి ప్రేమని
చూపించేవాడు
ఇంద్రజాలాన్ని
ప్రదర్శించే మెజీషయాన్లాగ
పిల్లనగ్రోవినందించి
పరవశ రాగాల్ని పలికించేవాడు
మ్యుజిశియన్లాగా
అల్లంతదూరాన
కంటికి కనిపించిన
మోడువారిన చెక్క ముక్కని
మేకల కాపరిగా మలచి.....
ఇందుశ్రీ.గొల్లపల్లి ౧/౨/౨౦౧౨ (1/2/2012)
చేతివేలి కుంచను
ఇంద్ర ధనస్సు రంగుల్లో ముంచి
కళల కాన్వాస్ పై చిలకరిస్తూ...
తనే చతుర్ముకుడై
తలరాతని చేతి గీతని
మార్చుకున్నాడు
అమ్మ ఒడిని దిగి
ఆమనిలో అడుగిదినపుడే....
అతను
ప్రకృతిలో తిరుగాడిన
తన పసి భాల్యాన్ని
మోతబావి మెట్లపై
పొలం పైరు తలలపై
నీటి వంకల అలలపై
పడుతూ లేస్తూ.. పరుగులుతీసే
పుడమి అందలసుందర రాసులని
తన కంటి కాగితంపై చొపించేవాడు
తొలకరి జల్లులకి
తడిసిన పుడమి
మట్టి వాసనని
ముక్కుపుటలనిండా పీల్చుకుని
గుండెలనిండా
నింపుకున్న తననిచూసి
శూన్యంలో ప్రయాణించే
వివిధ భంగిమ రేఖలు
అతని కుంచె ఒడిలో
అద్భుత చిత్రాలుగా ఒదిగిపోయేవి
మట్టి ముద్దని
మురిపెంగా చేతితో తాకి
తల్లి స్పర్శని
తండ్రి ప్రేమని
చూపించేవాడు
ఇంద్రజాలాన్ని
ప్రదర్శించే మెజీషయాన్లాగ
పిల్లనగ్రోవినందించి
పరవశ రాగాల్ని పలికించేవాడు
మ్యుజిశియన్లాగా
అల్లంతదూరాన
కంటికి కనిపించిన
మోడువారిన చెక్క ముక్కని
మేకల కాపరిగా మలచి.....
ఇందుశ్రీ.గొల్లపల్లి ౧/౨/౨౦౧౨ (1/2/2012)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి