సిద్ధార్థుడు
సూర్యుడు
సాయంత్రపు వయసు
సంచి మోపుని మూపున మోసుకుంటూ..
పడమటి కొండలవైపు
పరుగులుతీస్తున్న వేల
సమస్యల సాలెగూడులో
చిక్కుకున్నపుడో...
ఆలోచనవలలో చిక్కుకుని
గిలిగిలి లాడే చేపపిల్లలా ఉన్నపుడో..
మా
అలుగు వంకల
తిన్నెలమీద
తనవిలువైన సలహాల
సద్ది మూటని విప్పుతాడు
గౌతమభుద్దుడికి
భోది వృక్షం క్రింద
జ్ఞానోదయమైనట్లు
నాకు..
తన మాటల చెట్టు నీడన
జ్ఞానోదయాన్ని చూపేవాడు
నీలి గగన తారల
సరస విహారి చంద్ర సిద్ధార్థుడు
మేఘాలు
ఆకాశ మార్గాన
సముద్రుదిచిన జలసంపదని
తీసుకోచినట్లు....
తను నాకోసం
ఎన్నెన్నో..మంచి మంచి
సుక్తుల భరువు మోసుకోచ్చేవాడు
తన మాటల విత్తనాలని
నా మెదడు
మాగానిలో జల్లేవాడు
రుతుపవనాల ఆరంభాన్ని పసిగట్టి
తానిప్పుడు
పొలం గట్టు మంచెనేక్కి
ఏనిరశా గువ్వలు దరిచేరనీయకుండా
కర్షక సిద్దార్తుడై నిలుచున్నడు
పంట అంతకు అంతై ఎదుగుతున్నపుడు...
ఇందుశ్రీ .గొల్లపల్లి ౨.౦౧.౨౦౧౨ (2.1.2012)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి