23, డిసెంబర్ 2011, శుక్రవారం

maatru devatha

మా అమ్మ
ఆకాశం సాక్షిగా
నిప్పులు కక్కే ఎండలో
భూదేవి సాక్షిగా
నిప్పులకోలిమిని తలపించేవేడిలో
తలపై ఓజోన్ పొరలా ...
పాదాలక్రింద పాదరక్షలా ..
మాకోసం నిరంతరం
తనచుట్టూ తానుతిరుగుతూ...
అలుపెరగని గడియారంలా...
మా అమ్మ ఓ యంత్రంలా పనిచేస్తుంటే
మాకల్లకి ఆమె ప్రత్యక్ష దేవతే...

ఔను
పొద్దు పోడుకంటే ముందు
పొలం పనులకేల్లి
పిడికెడు కూదు మాకు అందించడంలో
ఆమె దేవతే..
ఒంట్లో రక్తమంతా
చెమటలా చిందించి
మా నుదుటి చెమట చుక్కలు తుడిచే
చదువుల తల్లి మా అమ్మ
మా కడుపులో ఆకలి బాధని తీర్చి
తన ఆకలిని ఆవులింతల్లో నిద్రపుచ్చే
సహనదేవత మా అమ్మ
ఆకలి భాదలేన్నున్నా
కన్న పేగు మమకారానికి
కడుపున  ఆకలిని కల్ల్హలో దాచి
మా కంటి నిదురకోసం
తన కాలే కడుపుతో జోలపాడుతుంటే
అమ్మ ఆకలి తెలియని పసిబాల్యం
ఆదమరచి నిడురపోయింది .
                                       ఇందుశ్రీ.గొల్లపల్లి
   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి