22, డిసెంబర్ 2011, గురువారం

dehamaina migalali kada

 ఏం..?
మిగిలింది గనక చెప్పడానికి
మా జీవన స్థితి గతుల
చద్ది మూట విప్పడానికి
మా గొంతునుండి
గావు కేకలేగాని
గాణ ఝురులుపారావు

ఎప్పుడో.. 
బ్రహ్మ చేతి ఘటము
మా నుదుటి తలరాతలని
లిఖించక మునుపే
ఈ సమాజం మా జీవన  స్థితి-గతులని
చిందరవందరగా అర్దంలేని చిత్రంగా చిత్రించింది

పచని సువిశాల
ఆకాశపు పందిరికింద
పేదరికంతో ముక్కుపచ్చలారని
నా జీవితానికి కదలీ వివాహం జరిగింది

నిర్దయ హృదయవిది
అశుభ ఘడియల రాహుకాలంలో
పౌరోహిత్యాన్ని పుచ్చుకొని
వేదమంత్ర ఉచ్చారణతో
నా జీవితానికి లఘ్న పత్రిక రాసింది
కన్నుతెరచి కాటికి పోఏదాక
కంటిమీది కునుకు ప్రశ్నర్దాకం
కడుపున ఆకలి ఆవులింతల్లోఆశ్చర్యార్ధకం

కత్తి పట్టి
కదనరంగానికి రమ్మంటుంది పేదరికం
ఓటమినోప్పుకొని ఒదిగి పొమ్మంటుంది
నావొంటినిస్సత్తువ

ప్రతి నిత్యం ,ప్రతి క్షణం 
పరుగులు తీయాలి
అటో..ఇటో..ఎటో..?
దారితెలియని గమ్యానికి
మూసుకుపోయిన దారులవెంట

నిరుద్యోగపు వట వృక్షపు నీదలో
ఆకలి కేకల మంటల్లో
కాలుతున్న మాజీవితల్ని
ఏ దేవుడు కరునిస్తాడో ....?
మాస్థితి గతుల కథలిని
ఏ కథకుడు వివరిస్తాడో...?
ఈ సామాజిక రాజ్యంలో
మాస్థితి గతుల్ని ఎవరు సరిజేస్తారో..?

ఇక మాకన్నుల తడితో
మాకడుపు మంటలు ఆరవు
చివరాకరికి....
ఆకలి చితి మంటల్లో
సతీ సహగమనం చేద్దామంటే...
దేహమైన మిగలాలి కదా..
                                    ఇందుశ్రీ.గొల్లపల్లి 

   
       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి