దేహమైనా మిగలాలి కదా..?
ఏం ..
మిగిలింది గనక చెప్పడానికి
మాజీవన స్థితి గతుల చద్ది ముట విప్పడానికి
మాగొంతు నుండి
గావు కేకలేగాని గాన ఝరులు పారవు
ఎప్పుడో ...
బ్రహ్మ చేతి ఘటం
మా నుదుటి తలరాతని
లిఖించక మునుపే..
ఈ సమాజం మాజీవన స్థితి గతులని
చిందరవందరగా
అర్ధం లేని చిత్రంగా చిత్రించింది
పచని
విశాల ఆకాశపు పందిరికింద
ముక్కు పచలరని
నా జీవితానికి కదలీ వివాహం జరిగింది
నిర్దయ హృదయ విధి
అశుభ ఘడియల రాహుకాలంలో
పౌరోహిత్యాన్ని పుచ్చుకుని
వేద మంత్రాల ఉచ్చారణతో
నాజేవితనికి లఘ్న పత్రిక రాసింది
కన్ను తెరచి
కాటికి పోయేదాక
కంటి మీద కునుకు ప్రశ్నార్ధకం
కడుపు ఆకలి ఆవులింతల్లో ఆశ్చర్యా ర్ధకం .
కతి పట్టి
కదన రంగానికి రమ్మంటుంది పేదరికం
ఓటమి నొప్పుకొని
ఒదిగి పొమ్మంటుంది నావుంటి నిస్సతువ
ప్రతి నిత్యం ప్రతి క్షణం
పరుగులు తీయాలి
అటో ఇటో ఎటో ..?
దారి తెలియని గమ్యానికి
మూసుకు పూయిన దారులవెంట
నిరుద్యోపు వట వ్రుక్షపునీడలో
ఆకలి కేకల మంటల్లో
కాలుతున్న మాజీవితల్ని ఈ
ఏ దేవుడు కరునిస్తాడో ..?
.మాస్థితి గతుల కథల్ని
ఏ కథకుడు వివరిస్తాడో...?
-ఇందు శ్రీ