ఆకలి చిరురునామా
ఉదయం
ఉరుకులపరుగులతో
మహానగర జన ప్రవాహం
ఎవరివిదులకి వారు హాజరవుతూ...హడావుడిగా...
రోడ్డెక్కిన జనసమూహం
ఎవరి విధిని ఎవరూ విస్మరించలేదు....
ఆవును ...
ఓ మున్సిపాలిటీ చేతకుప్పసాక్షిగా
ఓ రెండు భాల్యాలు
వీపున మోతసంచిలో
భాల్యాన్ని మోస్తూ...చితుకవర్ల వేటలో..
చింపిరి జూతు చిరిగినా నిక్కరు చేతితో
చేతకుప్ప పరిశీలన పురాతత్వ శాస్త్రవేతలాగా
ఆకలి చచ్చి
వెన్నుకంటిన కడుపుపై
నీవని నిక్కరు పదేపదే సర్దుకుంటూ ...
నగర వీడులన్నీ నడచి పదాలవి
ఆకలి మంటలని అదిమి పట్టి
పట్టెడు మేతుకులకై పోరాడే వారి
జీవితాలకి సజీవ సాక్షం
ఈ ఆకలి కేకల కుభేరులు
ప్రతి నిత్యం
విధితో పోరాడుతున్న వీరులు
ఆకలి కేకల చిరునామాలు
దారిద్ర్యానికి సన్నిహిత మిత్రులు
జానెడు పొట్టకోసం
పిడికెడు మెతుకుల వేటలో
అర్ధాంతరంగా భలౌతున్నవారి జీవితాలలో
ఏ మూలనుండో
ఓ చిన్న గొంతుక
ఇదేకదా ...?
సమాజంలో సామజిక సమస్యంటూ...
ఇందు శ్రీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి