నిదుర దుప్పటి
కప్పుకుంది ఆకాశం
పని పాటలతో అలసిపోయింది
పగలు పళ్ళెంత
రాగయుక్తంగా
గళమెత్తినది
అతని గొంతు
ఆ.. గొంతునుండి
జాలువారే తుంపర
తేనేపల్లవులకి
పల్లె కన్నుల నిదుర చెదిరింది
బాలచంద్రుదతను
అమావాస్య
చీకటిని చేల్చుకు వచ్చే నెలరేడు
ఆమని
ఆదమరిచి నిదురించేది
అతని గొంతునుండి
ప్రవహించే ప్రతి రాగానికి
చుట్టూ మూగేది పల్లె పల్లెంతా
వర్షించే మేఘం కోసం
ఎదురుచూసే పంటచేను లాగ
నునువేచ్చగా తాకే
సూర్య కిరణాల కోసం తామరలాగా...
పక్వ దశలోని పూవుకోసం .
గండు తుమ్మెదలాగా..
అతని పాటకోసం
పల్లె పల్లెంతా మీల్కొంది
ఆపల్లెని చూసే కన్నులు
ఎక్కడో...జారిపోయాయి
బ్రహ్మ రాసిన రాతలో
తల్లి కడుపులో
రూపొందకమునుపే..
నిమగ్నమై నిలిచింది
సరస్వతి అతనిలో...
పతి చేసిన పొరపాటుని సరిచేస్తూ...
ఇప్పుడతను
ఊరు ఊరంతా చూస్తున్నాడు
తన పాటకి వచ్చే ప్రతి స్పందనతో..
పక్షం రోజులకోమారు వచ్చే
నిండు చంద్రుడతను
నేడు...
రాహువు మింగిన రేరాజతను
అతని పాటల పూలవానలో
తడిసిన ప్రతి మనిషికి అతను గుర్తే....
ఏదో..ఒకరోజు
అతని గొంతుక
వెన్నెల రాతిరిలో
మరల వినిపించాకమానాదు
ఇందుశ్రీ.గొల్లపల్లి
కప్పుకుంది ఆకాశం
పని పాటలతో అలసిపోయింది
పగలు పళ్ళెంత
రాగయుక్తంగా
గళమెత్తినది
అతని గొంతు
ఆ.. గొంతునుండి
జాలువారే తుంపర
తేనేపల్లవులకి
పల్లె కన్నుల నిదుర చెదిరింది
బాలచంద్రుదతను
అమావాస్య
చీకటిని చేల్చుకు వచ్చే నెలరేడు
ఆమని
ఆదమరిచి నిదురించేది
అతని గొంతునుండి
ప్రవహించే ప్రతి రాగానికి
చుట్టూ మూగేది పల్లె పల్లెంతా
వర్షించే మేఘం కోసం
ఎదురుచూసే పంటచేను లాగ
నునువేచ్చగా తాకే
సూర్య కిరణాల కోసం తామరలాగా...
పక్వ దశలోని పూవుకోసం .
గండు తుమ్మెదలాగా..
అతని పాటకోసం
పల్లె పల్లెంతా మీల్కొంది
ఆపల్లెని చూసే కన్నులు
ఎక్కడో...జారిపోయాయి
బ్రహ్మ రాసిన రాతలో
తల్లి కడుపులో
రూపొందకమునుపే..
నిమగ్నమై నిలిచింది
సరస్వతి అతనిలో...
పతి చేసిన పొరపాటుని సరిచేస్తూ...
ఇప్పుడతను
ఊరు ఊరంతా చూస్తున్నాడు
తన పాటకి వచ్చే ప్రతి స్పందనతో..
పక్షం రోజులకోమారు వచ్చే
నిండు చంద్రుడతను
నేడు...
రాహువు మింగిన రేరాజతను
అతని పాటల పూలవానలో
తడిసిన ప్రతి మనిషికి అతను గుర్తే....
ఏదో..ఒకరోజు
అతని గొంతుక
వెన్నెల రాతిరిలో
మరల వినిపించాకమానాదు
ఇందుశ్రీ.గొల్లపల్లి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి