ఆకలి నింపిన కన్నీరు
ఎవడు...
నా కంటే
అదృష్టవంతుడు
ప్రత్యక్షంగా
ప్రేమనిండిన
అమ్మ కళ్ళని
చుసిన వాడెవడు
రోజుల భోజనం
రుచింపని నా
కడుపులో ఆకలికి
నాకన్నేల్లె కదలని
రోజులెన్నో నాజీవితంలో
నేడు
మొదటి సారి
ఇదే....చివరి సారేమో ..
కన్నీరోలికించింది
ఇంకో కన్ను
నా కడుపునా
ఆకలిని తన
కన్నీటి చూపుతో
తడిమి తడిమి చూసి
నా ఆకలి భాద
వినిపించింది
ఆ గొంతు నుండి
మృదు మంజుల వాణిగా..
మహోన్నత స్వర ఝురిగా
భహుశా ...
చూడలేదేమో
నా కన్నతల్లి కూడా
నా కడుపున
ఆకలిని తన
కన్నీటి ప్రేమతో
అడగనిదే
అమ్మైనా పెట్టడనే
సామెతని నిజం చేస్తూ..
ఇప్పుడు
ఇంకా రెట్టింపైంది
నాభాద ...
ఎందుకో తెలుసా ..
ఎందుకు
పుట్లేదా మీ
కడుపుననేనని
అయినా
మన కుటుంబం నిల్చున్న
నాలుగు స్తంబాలలో
మీరో ప్రదాన ఆధారం
మీరో కలికితురాయి
నా కుటుంబ కంటాభరణములో
పొదిగిన నలుగు ముత్యాలలో
ఇంకేం కావాలి
ఈ జీవితానికి ఇంతకంటే..
నీ కన్నీరే..
మాకు గోరు ముద్దలై
ఉగ్గు పాల శక్తిని ఇస్తుంటే ..
పర్లేదు..
ఇంకేమి..అక్కర్లేదు
నీ కడుపున పుట్టకపోయినా..
మమ్మల్ని దీవిస్తే ఆదే చాలు
మీ తడి నయనాలతో
ప్రేమ నిండిన హృదయంతో
ధన్యమై పోద్ది మాజీవితం
ఇదే చివరిసారేమో...
కాకూడదు చివర
చిగురులేయాలి
మన వంశ వ్యవసాయ క్షేత్రం
నీవిత్తే ప్రతి విత్తనంతో
ఉండాలి నీపోలికే
మావొంట్లో ప్రవహించే
ప్రతి రక్తపు బొట్టు
నీగుణ గణాలనే
నింపుకోవాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి