22, డిసెంబర్ 2011, గురువారం

nissabda yuddam

నీకు నాకు మద్య
నిస్సబ్ద యుధం
నిన్న మొన్నటి వరకు
ఒకే కొమ్మకు పెనవేసుకున్న
లేలేత ఆకుల లతలం

నేడు
మాటలులేని
మూగ చూపులు మనవి
భాహ్య ప్రపంచమంటే భయపడ్డ మనం
గీసు కున్న వృత్తంలో నిలువలేని వంటరితనం

తప్పు నీదైన నాదైన
నిశాభ్డానికి మాటని ఇద్దాం
గల గలా పారే సెల ఏరుల
సవ్వడి చేస్తూ మనం
మాట్లాడుతువుంటే
మనవ్రుత్తమంతా ఒంటరి తనాన్ని
వదులు కుంటుంది.

మనం పెనవేసుకున్న కొమ్మకి
మన గుర్తులు అలాగే నిలిచి వుంటాయి
మనం విడి పోయిన తర్వాత కూడా ..
అప్పుడు..
హృదయాలు బరువేక్కేది మనకి కాదు..
మనల్ని ఆదరించిన తనకి

మనం ఒకరికొకరం
జంటగా అల్లుకొని పచ్చనాకులని పొదుపుకొని
రేమ్మని బిగి కౌగిటిలో బంధించి పట్టుకుంటే
తను ఒరుసుకు పోతూ కూడా సంతోసిస్తుంది

నేడు
తన గాయాలు తనకే బరువవుతున్నాయి
మన మద్య  నడుస్తున్న నిశ్శబ్ద యుధ్ధాన్ని చూసి
                                                                      ఇందుశ్రీ.జి       

1 కామెంట్‌: